Anushka Sharma : వన్డే ప్రపంచ కప్ 2023 సెమీస్ దశకి చేరుకుంది.నవంబర్ 15న భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ జరగనుండగా, 16న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నారు. అయితే రీసెంట్‌గా నెదర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు. క్రికెట్ ప్రపంచ కప్ 2023 దీపావళి నాడు టోర్నమెంట్‌లోని తమ చివరి లీగ్ గేమ్‌లో ఒక వికెట్ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి రెండు ఓవర్లు ఇవ్వాలని రోహిత్ శర్మను బెంగళూరు చిన్నస్టేడియంలోని క్రికెట్ అభిమానులు కోరడం కనిపించింది.
ఇక ఆ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ రేర్ ఫీట్ ను నమోదు చేశాడు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ కు వచ్చిన కోహ్లీ.. కెప్టెన్ ఎడ్వర్డ్స్ వికెట్ ను సాధించాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది ఐదో వికెట్ కావడం విశేషం. చివరిసారిగా కోహ్లీ 9 ఏళ్ల క్రితం క్రికెట్ లో వికెట్ సాధించాడు. 2014లో బ్రెండన్ మెకల్లమ్ వికెట్ ను తీసిన కోహ్లీ.. మళ్లీ 9 ఏళ్ల తర్వాత వన్డేల్లో మరో వికెట్ సాధించాడు.విరాట్ కోహ్లీ వికెట్ సాధించగానే భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది.. నమ్మలేని విషయాన్ని చూసినట్లు ఆమె రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క్ శర్మ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 51 పరుగులతో రాణించాడు. అనంతరం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలంటూ స్టేడియానికి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడంతో వారి కోరికను మన్నించిన రోహిత్ శర్మ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ కూడా తీశారు. రెగ్యులర్ బౌలర్లను పక్కనపెట్టి బ్యాట్స్‌మెన్లు బౌలింగ్ చేయడాన్ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. గ్రౌండ్‌లో కేరింతలు కొట్టారు. అయితే ఇలా బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. కొన్ని అంశాలను ప్రయోగించే మ్యాచ్ కావడంతోనే నెదర్లాండ్స్‌పై బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించామని వెల్లడించాడు.
https://youtube.com/watch?v=5e17B2VGgm0