Rachin Ravindra : వన్డే వరల్డ్ కప్ 2023 నాకౌట్ దశకు దగ్గరలో ఉంది. సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా, మరోవైపు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పోటీపడనున్నాయి. పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే పాక్‌కు కూడా సెమీస్ అవకాశాలు ఉండటంతో.. సెమీస్‌కు న్యూజిలాండ్ ఇంకా అధికారంగా ప్రకటించలేదు కానీ, 99 శాతం సెమీస్‌లో న్యూజిలాండ్ ఆడే ఛాన్స్ ఉంది. అయితే.. లీగ్ దశలో న్యూజిలాండ్ నాలుగు వరుస ఓటముల తర్వాత.. శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్ సెమీస్ చేరుకునేందుకు భారత సంతతి ఆటగాడు రచిన్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి.
రచిన్ రవీంద్ర అనే కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లో 565 పరుగుల సాధించి ఈ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు రచిన్. ప్రస్తుతం అతనే టాప్ స్కోరర్. ఇప్పటికే మూడు సెంచరీలను కూడా బాదేశాడు. వాటితో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రచిన్ ఇదే విధంగా సెమీ ఫైనల్స్‌లో కూడా రాణించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్- పాక్ తలపడనున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలో చివరి రెండు మ్యాచులను న్యూజిలాండ్ బెంగళూరులోని ఆడింది. ఈ సందర్భంగా తన తండ్రి స్వస్థలానికి వచ్చిన రవీంద్ర.. తన నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాడు.
న్యూజిలాండ్‌లో పుట్టిపెరిగినా.. ఆమె నానమ్మ మాత్రం భారతీయ మహిళే కదా. అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటున్న తన మనవడికి దిష్టి తగలకూడదని అనుకుందో ఏమో కానీ.. ఆమె రచిన్‌ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీశారు. నాయనమ్మ దిష్టి తీస్తుండగా.. రచిన్ రవీంద్ర చిన్న పిల్లాడిలా బుద్దిగా కూర్చొని ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో దుమ్మరేపుతున్న రచిన్‌కి ఎవరి దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో రచిన్‌కు దిష్టి తీసారు అని అంటున్నారు.