Niharika Konidela : గత కొద్ది రోజులుగా రష్మిక వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మనం చూస్తూనే ఉన్నాం.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ, 1860.. సెక్షన్లు 465, 469, ఐటీ యాక్ట్ 2000లోని 66సీ, 66ఈ కింద కేసు నమోదు చేశారు. నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం.. మీడియాలో వార్తలు సైతం రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.ఇక రష్మిక వీడియోపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం తమదైన శైలిలో స్పందించారు.
అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాజాగా మెగా డాటర్ నిహారిక తన మూవీ పూజా కార్యక్రమంలో రష్మిక ఇష్యూపై స్పందించింది. ఒక ఆడపిల్ల విషయంలో ఏఐ టెక్నాలజీతో ఇలా చేయడం ఏ మాత్రం సహించం. వారికి జరిమానా వేయడం కాకుండా కఠినంగా శిక్ష విధించాలి. ఎవరినైన ఇలా చేయడం కరెక్ట్ కాదు. కఠినమైన శిక్షలు అయితే ఈ విషయంలో తీసుకోవాలి అని నిహారిక కోరింది.
ఇక నిహారిక కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నాగబాబు, వరుణ్‌తేజ్,లావణ్య త్రిపాఠి హాజరయ్యారు.