Klinkara Konidela : మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు దాదాపు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు క్లింకార ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మనవరాలి రాకతో చిరంజీవి – సురేఖ మురిసిపోయారు. అభిమానులు కూడా సెలబ్రేషన్లలో మునిగితేలారు. రామ్ చరణ్ కూతురు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిందో అప్పటినుంచి అన్ని శుభాలే జరుడుతున్నాయని మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా బాగా నమ్ముతున్నారు. ఇక క్లింకారని చూడాలని మెగా ఫ్యాన్స్ తెగ ఆరాట పడుతున్నారు. ఆ మధ్య స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు.
అమ్మమ్మ, తాతయ్యలతో క్లీంకార మొదటి స్వాతంత్ర్య వేడుకలు. ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు అనే క్యాప్షన్‌తో ఫొటోలను షేర్ చేసింది. ఐతే ఈ ఫొటోల్లో ఉపాసన తన కూతురి ఫొటోలను పాక్షికంగా మాత్రమే చూపింది. అమ్మమ్మ భుజంపై ఉన్న దుపట్టాలో సగం ముఖం దాగి ఉన్న ఫొటోలు మాత్రమే వెల్లడించింది. క్లింకార పూర్తి ఫొటోను వెల్లడించలేదు. ఇక ఇటీవల వినాయక చవితి వేడుకలలో కూడా క్లింకార పాల్గొంది. అప్పుడు కూడా క్లింకారని ఎత్తుకొని ఫొటోలకి పోజులిచ్చిన కూడా అందులో చిన్నారి ఫేస్ రివీల్ చేయలేదు. ఇక తాజాగా క్లింకార వీడియో ఇది అంటూ నెట్టింట ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. ఇందులో చిన్నారి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. క్లింకార భలే ముద్దుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
మెగా వారసురాలు.. చిరంజీవి కి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి కోకాపేట లో భూములు ఉన్నాయి. వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ భూములు తీసుకున్నారు ఆయన. కానీ వ్యవసాయం చేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో అలానే వదిలేశారు. కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవికి 20 ఎకరాల వరకు ఉన్నట్టుగా గతంలో ప్రచారం జరిగింది. చెల్లెల్లకు సుమారు ఐదు ఎకరాల భూమి వరకూ ఇచ్చారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈ లెక్కన చిరుకు అక్కడ 15 ఎకరాల భూమి ఉన్నా.. వెయ్యి కోట్లపైనే ఉన్నట్టు. ఇదంతా.. క్లింకార వచ్చిన వేళ విశేషమని మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.