Actor Siddarth : ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సిద్ధార్థ్ . ప్రస్తుతం ‘చిత్త’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ మూవీని ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేయాలని సిద్ధార్థ్ డిసైడ్ అయ్యాడు. అందుకే తెలుగుతో పాటు కన్నడలో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బెంగుళూరు వెళ్లిన సిద్ధార్థ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కావేరి వివాదానికి సపోర్ట్ చేయాలని చెప్తూ.. సిద్ధార్థ్ ప్రమోషనల్ ప్రెస్ మీట్‌ను అర్థాంతరంగా ఆపేశారు కొందరు వ్యక్తులు. ఆ సమయంలో సిద్ధార్థ్ చాలా కామ్‌గా ఉన్నాడు.
ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘చిన్నా’ సినిమా నా లైఫ్ డ్రీమ్. దీన్ని చేయటానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది. ఇదే విషయాన్ని మా గురువుగారు మణిరత్నంగారికి కూడా చెప్పాను. దానికి ఆయన ఎందుకలా చెబుతున్నావని అడిగారు. దానికి నేను ‘నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక రోజు నేనొక సినిమా తీస్తాను. నేను నా సొంత డబ్బులు పెట్టుకుని సినిమా చేసే నిర్మాతని. గత గురువారమే విడుదల కావాల్సిన సినిమా ఇది. నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమా ఇది.
సిద్ధార్థ్ అనే వ్యక్తి ఎందుకు నటిస్తున్నాడు.. ఇంకా యాక్టర్‌గా ఎందుకు కొనసాగుతున్నాడని చెప్పటానికి సమాధానమే ఈ సినిమా. ఈ సినిమా తెలుగు రిలీజ్ రోజు చూడు.. తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తారని కూడా డైరెక్టర్ అరుణ్‌కి ప్రామిస్ చేశాను. నాలుగు నెలల ముందే సినిమాను సెన్సార్ చేశాను. ఈ మధ్య కర్ణాటకలో ప్రెస్ మీట్ పెడితే నువ్వు తమిళోడివి వెళ్లు అన్నారు. మీ భాషను నేర్చుకుని మీవాడిగా మీ ముందుకొస్తుంటే బయటవాడినని ఆపేస్తున్నారేంటో అని అర్థం కాలేదు. నేను నవ్వుకుని బయటకు వచ్చేశాను. ఇక తెలుగులో ‘సలార్’ సినిమాతో పాటు వస్తానని డేట్ పెట్టాను. నేనూ ప్రభాస్ ఫ్యాన్‌ని. తన సినిమాను ఫస్ట్ షో నేను కూడా చూస్తాను. తర్వాత నా సినిమాను చూసుకుంటాను. రెండు సినిమాలు వస్తే తప్పేంటని ఆలోచించాను. సలార్ మీకు బడ్జెట్ పరంగా పెద్ద సినిమా కావచ్చు. కానీ ‘చిన్నా’ నా లైఫ్. వాళ్లు డేట్ మార్చేశారు. ఆరోజున పది సినిమాలు వచ్చాయి. సిద్ధార్థ్ కొత్తవాడేమీ కాదు. టాలెంట్ మీదున్న నమ్మకంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను మంచి సినిమా చేస్తే, నా ప్రేక్షకులు నా సినిమాని చూస్తారని చెప్పా. కన్నీళ్లని దిగమింగుతూ తెలుగులో సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారని అడిగారు.