విశాఖపట్టణంలో వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకు రావడం కలకలం రేపింది. మత్స్యకారులు ఈ పెట్టెను గమనించి. పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. చూసేందుకు భారీగా ఉన్న ఈ పెట్టెను బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేసారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చారు. .ఈ భారీ పెట్టెను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈ పెట్టె బరువు 100 టన్నుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అందరి సమక్షంలో పెట్టెను జేసీబీల సాయంతో పగులగొట్టారు.. ఆ పెట్టెలో ఏమీ లేదని తేల్చారు. కేవలం చెక్కల్ని ఓ దిమ్మెగా తయారు చేసినట్లు మాత్రమే వారు గుర్తించారు. అత్యవసర సమయాల్లో బోట్ల కోసం వేసే లంగరు బాక్స్‌గా దానిని గుర్తించారు. జేసీబీల సాయంతో పెట్టెను ఓపెన్ చేశారు.. చెక్క లేయర్స్ తప్ప ఏమీ లేదని తేల్చారు. అయితే బీచ్‌లో ఉన్న సందర్శకులు మాత్రం ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ రేపగా.. చివరికి ఏమీ లేదని తేలింది.
విశాఖ తీరానికి ఇలా వస్తవులు కొట్టుకురావటం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా కొన్ని వస్తువులు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆర్కే బీచ్ లో బ్రిటిష్ కాలం నాటి బంకర్లు బయటపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కాంక్రీట్ బంకర్ గా గుర్తించారు. జపాన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ పిల్ బాక్సులను ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన బంకర్‌లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే, కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిథిల స్థితిలో కనిపిస్తోంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి ఆలయం సమీపాన ఓ బంకర్ బయటపడింది.