Sitara Ghattamaneni : మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార పేరు ఇటివలి కాలంలో ఎక్కువగా పాపులర్ అవుతుంది. చిన్న వయసులోనే పీఎంజే జ్యుయలర్స్ అనే ఆర్మమెంట్స్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార చెప్పారు. దాంతో సితారపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఆమె నమ్రతా శిరోద్కర్‌తో కలిసి అతిపెద్ద మ్యాక్స్ ఫ్యాషన్ మానీక్విన్స్ బొమ్మల కొలువును ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా కలిగిన అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ( స్టోర్స్ ఆంధ్ర మరియు తెలంగాణలో కలిపి ఈ సంవత్సరం ఎండింగ్‌కి 82 చేరనున్నాయి.
దీంతో ముందే దసరా ఉత్సవాలను మానీక్విన్స్ బొమ్మల కొలువు తో మ్యాక్స్ ఫ్యాషన్ శనివారం ప్రారంభించింది. హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిన కెపిహెచ్బి నెక్సస్ మాల్లో 30 x 40 అడుగుల భారీ బొమ్మల కొలువును సితార ఘట్టమనేని శనివారం ప్రారంభించింది. ఇలాంటి మానీక్విన్స్ బొమ్మల కొలువుతో మ్యాక్స్ ఫ్యాషన్ ప్రచారంలో భాగమైనందుకు నమ్రత, సితార తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక సితారని చూసి ఆమెతో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఓ బామ్మ అయితే సితార బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంది. మరోవైపు సితార.. ఓ బామ్మని చేతితో పట్టుకొని స్టెప్స్ ఎక్కించింది. నమ్రత నేర్పిన సంస్కారం సితారకి చాలా అలవడింది. సితారని అలా చూసి సంతోషిస్తున్నారు.
ఇక ఇటీవల తనకి సినిమాలంటే ఇష్టమని, సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని సితార చెప్పారు. తన తల్లి నుంచి ఆత్మవిశ్వాసం నేర్చుకున్నానని చెప్పారు. సితారకి మంచి భవిష్యత్ ఉందని ఆమె టాలెంట్ చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. రానున్న రోజులలో సితార చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి టాలెంట్ చూపించనుందని అంటున్నారు. సితార ప్రస్తుతం మంచిగా చదువుకుంటూనే ఇలాంటి కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది.