Nara Brahmani : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తున్న విషయం విదితమే. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రాహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమానికి విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మోత మోగిద్దాం కార్యక్రమానికి సంఘీభావంగా ముందుగానే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లేట్లు, స్పూన్లు, కంచాలు, గరిటెలతో శబ్దాలు చేస్తూ…. ఈలలు వేస్తూ నారా బ్రహ్మణికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
అయితే తాజాగా బ్రాహ్మణి మాట్లాడుతూ..నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదన్నారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అని అన్నారు. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.బ్రాహ్మణి పిలుపుకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని ఆయన త్వరలో మన ముందుకు వస్తారని బ్రాహ్మణి ఆశాభావం వ్యక్తం చేసింది. జగన్‌ని తరిమి కొట్టాలని రాక్షస రాజ్యం పోవాలని బ్రాహ్మణి పిలుపు ఇచ్చింది.
చంద్రబాబును అరెస్ట్ చేయడం.. యువనేత లోకేష్ ను అరెస్టు చేస్తారని చెబుతుండటంతో బ్రాహ్మణి పేరు మరి కాస్త ఎక్కువుగా లౌడ్ గా వినిపిస్తోంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. పార్టీలో లీడ్ రోల్ ప్లే చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినా.. తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం ఆమెను ముందుకు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనివార్యమయ్యేలా ఉంది.చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. కుటుంబ సభ్యురాలిగా ఆమె బయటకు వచ్చి..టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన వారితో కలిసి మాట్లాడారు.