Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన, ఎన్ని విమర్శలు చేసిన కూడా అవన్నీ దాటుకొని ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, వైసీపీ ఎదుర్కోవాలంటే విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయడమే మార్గమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు.టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండడం తో పవన్ ఆయన ను పరామర్శించి వచ్చిన వెంటనే పొత్తు ప్రకటన చేశారు. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రకటనతో జనసేనలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు.టిడిపితో పొత్తు అనివార్యమని, జనసైనికులు అంతా తన వ్యూహాన్ని అర్థం చేసుకోవాలని , ఎక్కడా టిడిపిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని, రెండు పార్టీలు కలిసే పోటీకి వెళ్తాయి అని పవన్ ప్రకటించారు. అయితే దీనిపై జనసేన లో ఇంకా అసంతృప్తులు కొనసాగుతూనే ఉన్నాయి.సోషల్ మీడియా వేదికగా టిడిపికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు.వారిలో దిలీప్ సుంకర కూడా ఒకరు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడుతూ వస్తున్నారు. దీనిపై పవన్ తాజాగా స్పందించారు.
ఆయన ఏదో రాజీనామా చేస్తున్నట్టు ఏదో అన్నారు. నా మీద అలిగితే మీరు నాయకులు కాలేరు. నన్ను విమర్శించిన ఎన్ని అన్నా కూడా ఏం కాదు. నేను ఒక ఆశయంతో ముందుకు వెళుతున్నా. నేను ప్రస్తుతం ఒక్కడినే ఉన్నాను. మెల్లమెల్లగా పార్టీ కోసం పని చేసే వారిని గుర్తిస్తాను. కొంచెం ఆలోచించాలంటూ పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాగబాబు, మనోహర్.. అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు . కళ్యాణ్ దిలీప్ సుంకర గత కొద్ది రోజులుగా టిడిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ ఉండడంతో, నాదెండ్ల మనోహర్, నాగబాబు రంగంలోకి దిగి కళ్యాణ్ దిలీప్ సుంకర కు నచ్చజెప్పి ప్రయత్నం చేయడంతో, ఆయన కాస్త సైలెంట్ అయ్యారు.అయితే ఈ తరహా ఇబ్బందులు ముందు ముందు మరిన్ని ఏర్పడే అవకాశం ఉండడంతో, జనసేన ఈ విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది.