Jailer Movie Public Talk : మాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ అందిపుచ్చుకున్న హీరోల్లో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ సినిమా అంటే తమిళం, తెలుగు అనే భేదాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, తమన్నా కీలక పాత్రలను పోషించారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాలతో గురువారం (ఆగస్ట్ 10న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఓవర్‌సీస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
జైలర్ చిత్ర కథ గురించి చెప్పాలంటే రిటైర్డ్ ఉద్యోగి అయిన రజినీకాంత్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది. ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు. బడా మాఫియాతో వన్ మాన్ ఆర్మీ రజినీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేదే కథ… రజనీకాంత్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. జైలర్ సినిమాతో రజనీకాంత్ మంచి విజయం అందుకున్నాడని చెప్పాలి. నెల్సన్ మార్క్ కామెడీ, హీరో క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్,ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటాయి. ఎప్పటిలాగే నెల్సన్ డార్క్ కామెడీ ట్రై చేశాడు. అది నవ్వులు పూయించింది.
రజనీకాంత్ కల్ట్ క్లాసిక్ మూవీ బాషాను గుర్తుచేస్తే వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.. ఫస్ట్ హాప్‌లో కథ కంటే కామెడీ, యాక్షన్ అంశాలకే దర్శకుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సీరియల్ రోల్‌లో రజనీకాంత్ వేసే పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లోనే అసలైన కథలోకి దర్శకుడు ఎంటర్ అయ్యాడు. సినిమాని చాలా రసవత్తరంగా మలిచారు. యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ సైతం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.