Nara Lokesh : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఏపీ వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై తీవ్రమైన వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ అయిన చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించడంతో లోకేష్ చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. ఆయన జగన్ ప్రభుత్వంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. తన తండ్రి ఎప్పుడు చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటుందని , రక్తం మరుగుతోందని , కక్ష సాధింపు చర్యలు , స్వార్థ రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం తిరుగులేని శక్తితో మేము ఎదుగుతాం.ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా అంటూ లోకేష్ తన ట్విట్టర్‌లో పేర్కొనగా, ఆయన ట్వీట్‌కి మద్దతు తెలిపారు ప్రముఖ సినీ హీరో , చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ స్పందిస్తూ.. అన్యాయం ఎక్కువ కాలం నిలవదు కానీ సత్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది.దీనితో పోరాడుదాం నారా లోకేష్ అన్నా అంటూ నారా రోహిత్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలోను నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
నియంత పాలన వాస్తవం అయినప్పుడు.. విప్లవం ఒక హక్కు అవుతుందని నారా రోహిత్ పోస్ట్ చేశారు. ఈ చర్యకు మూల్యం చెల్లించక తప్పదని.. అయితే సమయం రావాలని అభిప్రాయపడ్డారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్ధరాత్రి 1:20 గంటలకు సీఐడీ అధికారులు ఎంట్రీ ఇచ్చి , తెల్లవారుజామున 3:10 గంటలకు పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 5:40 గంటలకు చంద్రబాబు బస్సు వద్దకు సీఐడీ పోలీసులు వచ్చారు. 5:43 గంటలకు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఉదయం 6:15 గంటలకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 6:25 గంటలకు చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.