Nara Brahmani : ఏపీ రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారుతున్నాయి. మరి కొన్ని నెలలో ఏపీ ఎలక్షన్స్ జరగనుండగా, రీసెంట్‌గా చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారిది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని, గడిచిన 24 గంటలుగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని ప్రజల వద్దకు వెళ్లాలని చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఓ వైపు యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ప్రజల్లో తిరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ చంద్రబాబు పలు కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. కాని సడెన్‌గా చంద్రబాబు అరెస్ట్‌తో బ్రాహ్మణి రాజకీయాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటుందట.
లోకేష్ అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని వైసీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో బాలయ్య కూతురు…బ్రాహ్నణి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటుందట. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల… ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టగా,ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నారా బ్రాహ్మణి అండగా ఉండాల్సిన అవసరవ వచ్చిందంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు. వైఎస్ మరణించిన తర్వాత సానుభూతి అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు వెల్లువలా వచ్చింది.
అలాగే ప్రస్తుతం సానుభూతిని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు ఇచ్చారని, అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోపాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే సానుభూతి వెల్లువలా వస్తుందంటున్నారు. బ్రాహ్మణి, భువనేశ్వరి రోడ్డెక్కి ప్రచారం చేస్తే.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మలుపు తిరగడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.