Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి ప్రమోషన్ అందుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా కొణిదెల వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకం ఇదేనంటూ ఓపెన్ అయ్యారు. అది కూడా ఓ హీరోయిన్ చేసిన ఛాలెంజ్ కారణంగా. ఏదేమైనా చెర్రీకి ఇషమైన ఆ వంటకం గురించి అయితే అందరికీ తెలిసిపోయింది. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు అనగా సెప్టెంబర్ 7న థియేటర్లోకి రానుంది.
ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ నవీన్ శెట్టి తన భుజాల మీద వేసుకుని చేస్తున్నాడు. ఇక అనుష్క కూడా తన వంతుగా… మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తో ప్రమోట్ చేస్తుంది బ్యూటీ. ఇక అనుష్క మొదట.. ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరింది. తనకు నచ్చిన రెసిపీ రాసి పంపాలని ఛాలెంజ్ విసిరింది. ఇక అనుష్క చెబితే.. ప్రభాస్ చేయకుండా ఉంటాడా.. వెంటనే తనకు నచ్చిన తనకు నచ్చిన రొయ్యల పులావ్ ఎలా చేయాలో చెప్పుకు వచ్చాడు. ఇక ప్రభాస్ అంతటితో ఆగకుండా రామ్ చరణ్‌కి ఛాలెంజ్ విసిరాడు. ప్రభాస్, రామ్ చరణ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఫ్రెండ్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్… తన వంతుగా ఓ రెసిపీ చేసాడు.
రామ్ చరణ్ తన ఫేవరెట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు. అంతేకా ఆ రెసిపీని టేస్ట్ చేసి సూపర్బ్‌గా ఉందన్నట్టు పోజులు ఇచ్చాడు. అనుష్క ప్రభాస్ ను బుక్ చేస్తే… ప్రభాస్.. రామ్ చరణ్ ను బుక్ చేశాడు. ఇక రామ్ ఇప్పుడు రానాని బుక్ చేశాడు. ప్రభాస్ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్… తను రానాకు ఛాలెంజ్ విసిరాడు. మరి రానా తన ఫెవరెట్ రెసిపీ ఏంటో.. ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే.. రానా ఛాలెంజ్ ను స్వీకరించేవరకు ఆగాలి.
https://youtube.com/watch?v=lmTsndBP-YM