Pawan Kalyan : ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బ్రిక్స్ సదస్సు, జీ20 సదస్సుకు హాజరయ్యే అతిధులకు పంపిన ఆహ్వానాల్లో “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్”, “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్” అంటూ పేర్కొన్న కేంద్రం.. ఇక అధికారికంగానే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో ఇండియా పేరు భారత్ అయితే ఏమేం మారతాయన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పేరు మార్పుపై కూడా పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇండియా బ్రిటిష్ వాడు పెట్టిన పేరు దానిని భారత్ గా మార్చాలని బహిరంగ చెప్పగలిగిన, ప్రతి ఒక్కరి ఎదుగుదలను కాంక్షించి వ్యక్తిత్వం గలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
ఈ భావం ప్రతి భారతీయుడిలోఉన్నప్పుడే వసుదైక కుటుంబ వారసులం అని గర్వంగా ప్రపంచానికి చెప్పగలం అని పవన్ కళ్యాణ్ సైరా నరసింహారెడ్డి ఈవెంట్‌లో అన్నారు. మన భారతదేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం. మనపైన అందరూ దాడి చేశారు కానీ భారతీయులు ఎప్పుడూ ఏ దేశం పైనా దాడి చేయలేదు. నరసింహారెడ్డి ఎలా బ్రిటిష్ వారితో పోరాడారో మనకు తెలియదు. ఆయన పోరాటాన్ని దృశ్యరూపంలో చూపించేదే ఈ చిత్రం అని పవన్ అన్నారు.
భారతదేశం తాలుకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది అన్న పవన్.. భారతదేశం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంటి వారి మహానుభావుల సమూహం అన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబాయ్ పటేల్, అంబేడ్కర్ వారి వారి జీవిత చరిత్రలు మనకు వారి త్యాగ గుణాన్ని చెబుతుందని పవన్ అన్నారు. అంటే ఆ నాడు పవన్ కళ్యాణ్ .. ఇండియాని భారత్‌గా మార్చాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారని, ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.