Perni Nani : మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. విజన్ 2020తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం పొడిచాడని ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ది సుత్తి విజన్..దిక్కుమాలిన విజన్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెబుతున్న చంద్రబాబు..గతంలో పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేసిన విషయాన్ని నాని గుర్తు చేశారు. విద్యుత్, విద్యారంగం, ఆరోగ్య రంగంపై చంద్రబాబుకు ఉన్న విజన్ ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు.
పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన వారిని తూటాలతో పిట్టలను కాల్చినట్లు కాల్చి ముగ్గుర్ని చంపేసిన వ్యక్తి ఛార్జీలు తగ్గిస్తాననడం విడ్డూరమన్నారు. ఇదేనా విజన్? అని ప్రశ్నించారు. చంద్రబాబు 2020, 2047తో కాలజ్ఞానం చెబుతున్నాడని..గతంలో ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ చెబితే కరెంట్ తీగలపై బట్టలు ఆరేయడానికి మాత్రమే పనికి వస్తుందని విమర్శలు చేసిన విషయం మరిచిపోయారా అని అన్నారు. 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడని..అప్పటి నుంచి 14 ఇల్లు అధికారంలో ఉండి ఏం చేశాడో చెప్పాలని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల నుంచి ఏం పొడిచాడు. ఎన్టీఆర్ ను కసక్కుమని వెన్నుపోటు పొడిచి విజన్ 2020 అని చెప్పాడని..కానీ చేసిందేమి లేదన్నారు. మళ్లీ ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని దుయ్యబట్టారు.
1995లో మొదటిసారి ఏదో కుయుక్తులు చేసి.. వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాడని, నాటి నుండి 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం పొడిచాడో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ను కసక్కుమని వెన్నుపోటు పొడిచి విజన్ 2020 అని చెప్పాడని, కానీ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని చంద్రబాబు చెబుతుంటారని, మరి అలాంటి వ్యక్తిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? ఎందుకు కూల్చారు? అని ప్రశ్నించారు. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానని అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాక కనీసం నీ చిత్తూరు జిల్లాకు ఎన్ని చెంబుల నీళ్లు ఇచ్చావ్? కనీసం కుప్పం నియోజకవర్గానికైనా ఇచ్చావా? అని నిలదీశారు.2004లో వైఎస్ వచ్చాక పేదలపై భారం తగ్గిందన్నారు. ఇది దివాలాకోరుతనం విజన్ కాదా? అని పేర్ని నాని అన్నారు.