Roja : తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే రోజా తిరుమలలో నడుస్తూ ముందుకొస్తున్న సమయంలో కొందరు మహిళలు ఆమె కాళ్లు మొక్కారు. ఇది చూసి అంబటి రాంబాబు ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
ఏపీ మంత్రిగా రోజా ఏపీలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. తనని ఎవరు విమర్శించిన కూడా వెంటనే స్పందించే రోజా ..జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన మీరు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. చిరంజీవి సలహాలు ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడుకు ఇవ్వాలన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ పెట్టడంపై చిరంజీవి ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు చిరంజీవి బాగా లబ్ధి పొందారని, రాష్ట్రానికి మాత్రం చేసింది ఏమీ లేదని రోజా విమర్శించారు. చిరు చెప్తే వినే స్థాయిలో తమ ప్రభుత్వం లేదని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముందు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే తమ్ముడుకు ఇవ్వాలని, ఆ తర్వాత తమకు ఇవ్వాలని రోజా తెలిపారు. అసలు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం సరికాదని తెలిపారు. తిరుపతి జిల్లాలోని వడమాల పేట మండలం టీసీ ఆగ్రహరంలో ‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన విధంగా ప్రతి భారతీయుడు ” మేరీ మట్టి మేరా దేష్” కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.