Ram Charan : గత కొన్నిరోజులుగా టాలీవుడ్ అండ్ ఏపీ రాజకీయాల మధ్య వాదనలు, ప్రతివాదనలు ఏ రేంజ్‌లో సాగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేయడం, ఆ మూవీ కలెక్షన్స్ పై ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను అనడం పలు డెబిట్స్ కి దారి తీసింది. వీటి పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇక ఆగష్టు 7న వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ జరగగా, ఆ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్‌గా మారాయి.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తరువాత చిరంజీవి.. పాలిటిక్స్ గురించి ఇంత డైరెక్ట్ గా మాట్లాడటం ఇదే తొలిసారి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు పై గుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని రియాక్ట్ అయ్యారు. “ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. ఆ పకోడీ గాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాన్ని లెక్కచేయని వాళ్లకి కూడా సలహాలు ఇస్తే బాగుంటుంది. మనకి ఈ రాజకీయాలు ఎందుకు డాన్స్‌లు, ఫైట్స్ చేసుకుందామని చెప్పొచ్చు కదా. ఇద్దరికీ కలిపి సలహాలు ఇస్తే బాగుంటుంది” అంటూ వ్యాఖ్యానించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి.
మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి” అంటూ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ గట్టిగా స్పందించినట్టు తెలుస్తుంది.తన తండ్రిపై తప్పుడు కామెంట్స్ చేసే వారికి గట్టిగా రాడ్ దింపేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడని ఇన్‌సైడ్ టాక్. గతంలో ఓ ఈవెంట్ లో చరణ్ వైసీపీ నాయకులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇన్ డైరెక్ట్‌గా ఇవ్వడం మనం చూశాం.