Sajjala Ramakrishna Reddy : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఓ కల్పితమైన కథ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు దేశం పార్టీ పార్టీకి, దాని అనుకూల మీడియాకి అవసరమైన మసాలా సరుకుగా సీబీఐ ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే నిలిచిపోతుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.. ఈ విషయంలో బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయిందని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ వ్యవస్థకు ఓ వైరస్‌లా పాకారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య వల్ల ఎవరికి నష్టమో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని చెప్పారు. నేను భారతీ రెడ్డి ఒకే చోట ఉన్నామని చెప్పడం అవాస్తవాలు. నేను ఆ సమయంలో అక్కడ లేదు కాబట్టి ఈవిషయంపై క్లారిటీ చెబుతున్నాను.
చనిపోయినప్పుడు ఎవరైన ఎందుకు నిస్సహయతగా ఉంటారు. ఆ సమయంలో చంద్రబాబు, రామోజీరావు, బాలకృష్ణ ఎవరైన ఈ సమయంలో అలానే ప్రవర్తిస్తారుగా అంటూ సజ్జల అన్నారు.వివేకా కేసులో బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో చంద్రబాబు చేయాల్సిదంతా చేశారని ఆరోపించారు. సునీత చెప్పినవన్నీ అబద్ధాలేన్నారు సజ్జల. భారతి, తాను సునీత ఇంటికి వెళ్లలేదని.. వివేకా హత్య జరిగిన పది రోజుల తర్వాత మాత్రమే తన భార్యతో కలిసి పరామర్శించడానికి వెళ్లానని గుర్తుచేశారు. వివేకా మర్డర్ కేసు సీబీఐ కీలక విషయాలను పక్కన బెట్టిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. రెండు సిట్లు తేల్చిన అంశాలను పట్టించుకోకుండా.. కాల్ రికార్డింగ్స్‌ను సీబీఐ పరిగణనలోకి తీసుకోకుండా.. వాంగ్మూలాలను ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారని సజ్జల ఆరోపించడం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తుంది.