Manchu Lakshmi : ఆడదాని జీవితం అమ్మతోనే పరిపూర్ణం అవుతుందని అందరికి తెలిసిన విషయమే. అమ్మ కావాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుకుంటుది. అయితే కొందరికి కొన్ని పరిస్థితుల వలన పిల్లలు పుట్టరు. ఆ నాటి రోజులలో వారిని గొడ్రాలు అంటూ చాలా తీవ్రంగా దూషించే వారు. అయితే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ రావడంతో ఈ టెక్నాలజీని కొంత మంది సెలబ్రిటీస్ అడాప్ట్ చేసుకున్నారు. సరోగసితో పిల్లలకు జన్మనిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో సరోగసి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కానీ అద్ధె గర్భంతో విద్యా నిర్వాణకు తల్లి అయింది మంచు లక్ష్మి. దీనికి ఆమె వ్యక్తిగత కారణాలు ఆమెకు ఉన్నాయి.
మంచు లక్ష్మి 2006 లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా, ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ రాగా, తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది. మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచమని పేర్కొంది. అందుకే నేను ఇండియా వచ్చాను.
మా వారు అమెరికాలో ఉంటారన్న మాటే కానీ, అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది మంచు లక్ష్మీ. ప్రాథమిక పాఠశాల పిల్లల భాషా సామర్థ్యాలు పెరగాలంటే టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్ జి.ఓ. ద్యారా సాధ్యం అవుతుందని భావించిన పెగాసిస్టమ్స్ మద్దతుగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని తెలిపిన మంచు లక్ష్మీ తన ఇంటికి వచ్చే పిల్లలని కూడా పంపించనని చెప్పింది. నాకు ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని ఉండేది. కాని అది కాలేదు. విద్యాతో సరదగా గడుపుతాను అని పేర్కొంది. పిల్లలతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని మంచు లక్ష్మీ తెలియజేసింది.