Niharika Konidela : గత రెండు రోజులుగా నిహారిక-చైతన్య విడాకుల అంశంపై నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నుండి వారిద్దరు దూరంగా ఉంటున్నారని,విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారాలు సాగగా, ఎట్టకేలకు జూలై 5న వాటిపై క్లారిటీ వచ్చింది. నిహారిక, చైతన్యలు తమ సోషల్ మీడియా ద్వారా విడాకుల గురించి అఫీషియల్ ప్రకటన చేయడంతో ఇన్నాళ్ల నుండి జరిగిన ప్రచారాలు నిజం అయ్యాయి. దీంతో చైతన్య పేరు కూడా ఒక్కసారి హాట్ టాపిక్ అయింది. అతను ఎవరు, అతను ఏ ఉద్యోగం చేస్తాడు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఇలా పలు విషయాలపై ఆరాలు తీస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని ఓ పోలీస్ బాస్ కుమారుడు అయిన చైతన్య బాగా చదువుకున్న వ్యక్తి అతడు ఆరుడుగుల పొడవు,అందంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత, రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు. ఆపై హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పొందాడు. కాలేజ్ డేస్‌లో.. స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కూడా పనిచేశాడు చైతన్య. చదువు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలలో ఇంటర్న్ షిప్ చేసి.. వ్యాపారరంగంలో మంచి అనుభవం సంపాదించాడు.
ఇక చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకరరావు పోలీసు అధికారి. ప్రస్తుతం ఆయన గుంటూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు. చైతన్య తాత వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా ఇన్‌స్పెక్టర్. చైతన్య తల్లి గృహిణి. అతనికి దీపిక అనే ఒక అక్క ఉంది. ఆమె తన భర్తతో కలిసి యూస్ లో ఉంటుంది. అనేక సంస్థలలో పని చేసిన చైతన్య తనే ఒక కొత్త కంపెనీనీ నెలకొల్పి ఎంతో మందిక ఉపాధి చూపించారు. ఇక చిరంజీవి తండ్రి, చైతన్య తాత మంచి స్నేహితులు కాగా, వారి రెండు ఫ్యామిలీల మధ్య మంచి స్నేహ బంధం ఉడేది. ఆ క్రమంలోనే చైతన్య ప్రముఖ సౌత్ ఇండియన్ నటి, నిర్మాత నిహారిక కొణిదెలను వివాహం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 13, 2020న జరిగింది. డిసెంబర్ 9, 2020న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నిహారిక అత్త మామగారి ఆచారాలు, కట్టుబాట్లు ఫాలో కాకపోవడం వల్లనే వారి విడాకులు జరిగిందని అంటున్నారు.