Priya Choudary : కొన్ని సంవత్సరాల క్రితం సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకోగా, ఈ విషయం ఎంతో హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పుడు వారి విడాకుల తర్వాత నిహారిక-చైతన్య విషయం కూడా ఇంత హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్లకు విడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు చర్చలు జరుపుతున్నారు. కొందరు తీవ్ర మనస్పర్ధలు వలననే వారు విడిపోయారని అంటున్నారు. ఒకరితో ఒకరు కలిసి ఉండలేం అని నిర్ణయించుకున్న తర్వాత విడిపోవాలని విడాకులకు అప్లై చేసుకున్నారు ఈ జంట.
మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న వీళ్ళకు.. జూన్ 5న డివోర్స్ మంజూరు చేసింది కోర్టు. దాంతో అధికారికంగా ఇద్దరు విడిపోయారు. కొన్ని రోజులుగా మళ్లీ తన కెరీర్ తో బిజీ అయిపోయింది నిహారిక. మరోవైపు చైతన్య కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఏదేమైనా మెగా కుటుంబంలో మరో విడాకులు కూడా రావడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. గతంలో ఇదే కుటుంబం నుంచి చిరంజీవి కూతురు శ్రీజ, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అమ్మగారు కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఇలా విడాకులు కావడానికి కారణం అతి గారాబమే అని ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి చెప్పుకొచ్చారు.
వారందరు చిరంజీవి, సురేఖలని చూసి నేర్చుకోవాలి. అల్లు రామలింగయ్య కూతురు అయిన సురేఖ.. సామాన్యుడు అయిన చిరంజీవిని చేసుకొని ఎంత ఒదిగిపోయింది. చిరంజీవి చుట్టూ ఎంతో మంది అందగత్తెలు ఉన్నా ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన ఏనాడు తప్పు చేయలేదు. హిస్టరీ క్రియేట్ చేసిన చిరంజీవి వెనక సురేఖ ఎన్నో త్యాగాలు చేసింది. వారిని చూసి మీరు ఎందుకు నేర్చుకోవడం లేదు. పెద్దలు సంపాదించిన ఆస్తులు చూసుకొని మీరు ఉన్నంతగా ఉన్నారని అనుకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించింది. కూతుర్ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చిన చాలా హుందగా వ్యవహరించారు. ఆయన నిజంగా గ్రేట్ అని ఆమె స్పష్టం చేసింది.
https://youtube.com/watch?v=Xt6y9O1bgh8