Allu Arjun : జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్న ఎలక్షన్స్ కోసం ప్రచారాలు షురా చేసిన విషయం తెలిసిందే. జూన్ 14 నుండి 30వరకు ఉభయగోదావరి జిల్లాలలో పవన్ కళ్యాన్ వారాహి యాత్ర చేశారు. ఈ యాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైసీపీ నాయకులని చీల్చి చెండాడుతూ పవన్ విమర్శల వర్షం గుప్పించారు. అదే క్రమంలో తను ఇతర హీరోలపై పొగడ్తల వర్షం కురిపించారు. ముమ్మడివరంలో బహిరంగ సభ నిర్వహించగా ఈ సభలో పొలిటికల్ స్పీచ్ లతో పాటు సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు. నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవపడతారు ఎప్పుడూ అని. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ గారు, బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు.. ఇలా అందరు హీరోలు ఇష్టం, గౌరవం.
మేము కనపడితే మాట్లాడుకుంటాం. మేము అందరం బాగానే ఉంటాం. సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు ఇష్టపడితే మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట వినండి అని అన్నారు. భీమవరం సభలోను ప్రభాస్, మహేష్‌లతో పాటు పలువురు హీరోల ప్రస్తావన తెచ్చి వారంటే నాకు చాలా ఇష్టమని చెప్పి ఆయా హీరోల అభిమానుల అటెన్షన్ పొందారు. నెగ్గాలి అంటే తగ్గాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పవన్ . హీరోలందరి అభిమానుల్ని ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.పాత వివాదాల్ని తవ్వి తీసి మరీ తన అభిమానుల తరుపును తాను స్వయంగా క్షమాపణలు అడుగుతున్నారు.
కాగా పవన్ రాజకీయ పార్టీ పెట్టి దశాబ్ధం అయింది. ఇన్నాళ్లు పవన్ నోట రాని కొత్త కొత్త పదాలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ సారి ఎలాగైన పవన్ నెగ్గాలని కసితో ఉన్నారు. అందుకే సినిమా హీరోలని కూడా కలుపుకొని పోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎలక్షన్స్ సమయంలో మెగా హీరోలు సైతం పవన్ కోసం ప్రచారం చేస్తారని టాక్. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ డం అందుకున్న అల్లు అర్జున్.. వారాహి రధం ఎక్కి పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారనే టాక్ నడుస్తుంది. గతంలో ఓ సందర్భంలో పవన్ వెంట ఉన్న బన్నీ ఈ సారి తన చిన్న మావయ్యకోసం కాస్త ఎక్కువ కష్టపడాలని అనుకుంటున్నారట. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో..!