CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి… పార్వతీపురం మన్యం జిల్లా… కురుపాం మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో అమ్మఒడి పథకం నాలుగో విడత నిధులు విడుదల చేశారు. వచ్చే 10 రోజుల్లో 42 లక్షల మందికి పైగా తల్లుల అకౌంట్లలో రూ.6,392 కోట్లు జమ అవుతాయని తెలిపారు. నాలుగేళ్లుగా మొత్తం 26 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామన్న జగన్… బటన్ నొక్కడం అంటే ఇది అన్నారు. ఈ విషయం తెలియని వారికి తెలిసేలా చెయ్యాలని లబ్దిదారులను కోరారు. అయితే ఈ ఈ కార్యక్రమంలో మనస్విని అనే 9 ఏళ్ల బాలిక తన స్పీచ్‌తో అదరగొట్టింది.
నేను ఇన్ని రోజులు తెలుగు మీడియంలో చదివాను. ఇప్పుడు జగన్ మావయ్య ప్రవేవపెట్టిన అమ్మ ఒడి ద్వారా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాను. అమ్మ ఒడి కార్యక్రమం ఎంతో గొప్పది. ఆ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు డైరెక్ట్‌గా మా అకౌంట్ లో పడుతున్నాయి. మంచి చదువులు చదువుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కాని అమ్మ ఒడి ద్వారా ఇప్పుడు అందరు బాగా చదువుకుంటున్నారు. జగన్న విద్యా కానుక కూడా ఎంతో గొప్ప పథకం అని దాని వలన పేద విద్యార్ధులకి ఎంతో లాభం చేకూరుతుందని మనస్విని చెప్పుకొచ్చింది.
మనస్విని మాట్లాడుతున్నంత సేపు ఆ ప్రాంగణం మారు మ్రోగింది. గుక్క తిప్పుకోకుండా గలగల మాట్లాడుతూ ఇటు తెలుగు అటు ఇంగ్లీష్‌లో తెగ సందడి చేసింది. మనస్విని టాలెంట్‌కి ఫిదా అయిన సీఎం జగన్ ఆమెని అభినందించారు. అనంతరం ఆయనతో కలిసి ఓ ఫోటో కూడా దిగింది మనస్విని. ఇక జగన్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామన్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించామన్నారు.