Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులని తీవ్రంగా విమర్శిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వైసీపీ నాయకులు కూడా పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ చేసిన కామెంట్స్ కి గాను తాజాగా పవన్ ఆయనని ఇమిటేట్ చేస్తూ పరువు తీసారు. అమ్మ ఒడి నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ… సరిగ్గా అక్షరాలు రాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు.
సీఎం జగన్‌కు వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందన్నారు. తానేదో ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ బాధపడుతున్నట్టున్నారు.. ఇక నుంచి జగన్ స్టైల్‌లోనే ఇలా.. ఇలా మాట్లాడతానంటూ సీఎంను అనుకరిస్తూ సెటైర్లు వేశారు. అసలు అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో సీఎం జగన్ అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని ఫైరయ్యారు. జగన్‌కి‘అ’ నుంచి ‘‘అం, అ:’’ వరకు అక్షరాలు రావని.. దీర్ఘాలు కూడా రావని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి తానే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తానని పేర్కొన్నారు.
![Pawan Kalyan : అక్షరాలు రాని సీఎం మన ముఖ్యమంత్రి.. ఇమిటేట్ చేస్తూ మరీ జగన్ పరువు తీసిన పవన్.. Pawan Kalyan imitated cm ys jagan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-14.jpg)
అలాంటి ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నవరం నుండి వారాహి పై యాత్ర మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చిందని పెదఅంబరంలో యాత్రకు రెండురోజులు బ్రేక్ ఇచ్చారు. పవన్ కు పూర్తి స్థాయిలో రెస్ట్ అవసరం అనీ ఈ రెండురోజుల పాటు ఆయన ఎవ్వరినీ కలవరని పార్టీ వర్గాలు తెలియజేశాయి. జూన్ 30న భీమవరంలో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు.