YSRTP : ఏపీ రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలు సైతం రోజు రోజుకి రసవత్తరంగా సాగుతున్నాయి. రాజన్న బిడ్డ, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ..కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా పాదయాత్రలో విమర్శలు చేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం షర్మిల భర్త అనిల్ కు ఎసిసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్‌తో సోనియా, రాహుల్ పర్యటన గురించి వేణుగోపాల్ చర్చించినట్లు ఏఐసీసీ విశ్వసనీయ వర్గాల వెల్లడించాయి.
విజయమ్మ, షర్మిలతో సోనియా గాంధీ మాట్లాడతారని వేణు గోపాల్.. అనీల్‌కి తెలిపినట్టు సమాచారం. వచ్చేనెల 8వ తేదీన ఇడుపులపాయకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానుండగా,ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఇడుపులపాయ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులు అర్పించనున్నారు. ఆ రోజు సోనియా, రాహుల్‌ని కలిసి కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం చేయబోతున్నట్టు షర్మిళ ప్రకటించనుందని అంటున్నారు. ఇది లాంఛనమే అని పొలిటికల్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
తెలంగాణ కోడలిని అంటూ పార్టీని స్థాపించి..సుమారు రెండేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల. ఈక్రమంలోనే అటు రాష్ట్రంలోని బీఆర్ఎస్‌ని, కేంద్రంలోని బీజేపీ పాలకులపై విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం చేయడం, వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు జై కొట్టడంతో అంతా చకచకసాగిపోవడం వెనుక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో షర్మిళ కాంగ్రెస్ తరపునే పోటీ చేయనుందని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల పోటీ చేస్తానని మొదట్నుంచి షర్మిళ చెబుతూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతో కూడా అదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ తరపున పాలేరు నుంచి బరిలోకి దిగడం కూడా కన్ఫామ్‌గా తెలుస్తోంది.