Allu Arjun And Sreeleela : తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. కెరీర్ ప్రారంభం నుండే తన అద్భుతమైన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఎవ్వరూ అనుకోని పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న బన్నీ ఇప్పుడు కేవలం వెండితెర కి మాత్రమే పరిమితం కాకుండా బుల్లితెర ఆడియన్స్ ని కూడా అలరించబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు. ఆహా మీడియా అల్లు అర్జున్ ని హీరో గా పెట్టి ఒక సినిమాని చేయబోతున్నారట.
అయితే అది కేవలం ఓటీటీ ఆడియన్స్ కి మాత్రమే అని టాక్. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నాడు అట. చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల పుట్టిన రోజు కావడం తో ఆమెతో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ వేస్తున్న ఫోటో స్టిల్ ఒకటి రీసెంట్‌గా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంది. శ్రీలీలకి ఇది బెస్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరితో వెబ్ సిరీస్ చేస్తారా? ఓటీటీ ఫిల్మ్ చేస్తారా అనేది పెద్ద సస్పెన్స్. ఆహాలో అల్లు అర్జున్ ఓ కొత్తగా `ఆహా ఒరిజినల్స్` ని లాంచ్ చేయబోతున్నారట. ఇందులో వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ నిర్మించబోతున్నారట.
వాటికి సంబంధించిన బాధ్యత బన్నీ తీసుకుంటున్నారని, ఆయన నిర్మాణంలోనే ఇవన్నీ రూపుదిద్దుకుంటాయని సమాచారం. దాని ప్రమోషన్స్ కోసమే అల్లు అర్జున్, శ్రీలీల లపై ప్రమోషనల్ యాడ్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. వీటన్నింటిపై క్లారిటీ రావలసి ఉంది. అయితే డాన్సుకి బ్రాండ్‌అంబాసిడర్‌గా మారుతున్న బన్నీతో, మరో డాన్స్ సెన్సేషనల్‌గా పేరుతెచ్చుకుంటోన్న శ్రీలీల కలిసి స్టెప్పులేస్తే `ఆహా` దద్దరిల్లిపోవాల్సిందే . ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా మారింది. ఈ అమ్మడు ఏకంగా ఎనిమిది సినిమాలతో బిజీగా ఉంది. అయితే బన్నీతో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు.