Lavanya Tripathi : వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకొని ఒక్కసారి వార్తలలో నిలిచింది లావణ్య త్రిపాఠి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందాల రాక్షసి చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లావణ్య ఆ తర్వాత చాలానే సినిమాలు చేసింది. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఈ అమ్మడికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. గతంలో వరుణ్ తేజ్‌తో కలిసి ‘మిస్టర్’..’అంతరిక్షం’ సినిమాల్లో నటించారు లావణ్య త్రిపాఠి. అప్పుడే స్నేహం మొదలైంది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వారిదారి తీసింది.
ఇప్పుడు మెగా కోడలి ప్రమోషన్ అందుకున్న లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తల్లిదండ్రులు ఏం చేస్తారు. తోబుట్టువులు ఎంతమంది? లావణ్య బర్త్ ప్లేస్ ఎక్కడ? వంటి వివరాల కోసం ప్రతి ఒక్కరు వెతకడం మొదలు పెట్టారు. లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు. ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది.
కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది ఈ అమ్మడు. 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కూడా గెలుచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చదువు కొనసాగించి ఎట్టకేలకు 2012లో ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’..’సొగ్గాడే చిన్ని నాయనా’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి విజయాలుఆమె తన ఖాతాలో అందుకుంది. కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రయత్నాలు చేసింది. అవి ఆశించిన ఫలితాలివ్వలేదు. కెరీర్ ప్రారంభమై దశాబ్ధం దాటినా లావణ్య స్టార్ హీరోయిన్ల లీగ్లో మాత్రం చేరలేకపోవడం గమనర్హం. లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబర్ 15వ తేదీన యూపీలోని ఫైజాబాద్‌లో జన్మించింది. ఆ తర్వాత ఆమె ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో పెరిగింది.