Anshu Malika : సినీ ప్రముఖలు తనయులు, తనయలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నం.కొందరు హీరో, హీరోయిన్స్ గా రాణిస్తుంటే మరి కొందరు సపోర్టింగ్ రోల్ లో సత్తా చాటుతుంటారు. ఇప్పుడు ఈ క్రమంలోనే మాజీ హీరోయిన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కుమార్తె కూడా సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. రోజా కుమార్తె అన్షు మాలిక ఎప్పటి నుంచో సినిమాల్లోకి రాబోతోంది అంటూజోరుగా ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం మీద ఎప్పుడూ రోజా కానీ ఆమె కుటుంబం కానీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఇప్పుడు ఒక సినీ వారసుడు నటించబోతున్న సినిమాలో రోజా కుమార్తె అన్షు మాలిక హీరోయిన్ గా నటించబోతుందని ఇదే ఆమెకు మొదటి సినిమా కాబోతోంది అనే ప్రచారం జరుగుతోంది.
అన్షుమాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆ మూవీ సక్సెస్ అవుతుందని రోజా అభిమానులు అంటున్నారు. ఇటీవలే అన్షుమాలిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఇవి చూసిన వారందరు హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు ఆమెకు ఉన్నాయని.. అన్షుమాలిక సినిమాల్లోకి రావాలని రోజా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అన్షుమాలిక స్టార్ హీరో కొడుకు సినిమాతో డెబ్యూ చేయనుందని సమాచారం. విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో అన్షుమాలిక ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.
ఇప్పటికే పలు సినిమాలలో నటించి మెప్పించాడు. ధృవ్. అయితే అనుకున్న రేంజ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇప్పుడు కొత్త సినిమాతో హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోంది. త్వరలోనే అన్షుమాలిక ఎంట్రీని కన్ఫామ్ చేస్తారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అన్షుమాలిక కానీ రోజా కానీ స్పందిస్తే ఓ క్లారిటీ వస్తుంది. కాగా, రోజా సినీ రంగంలో హీరోయిన్ గా సత్తా చాటి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తర్వాత జబర్దస్త్ జడ్జిగా మారి మరింత క్రేజ్ సంపాదించారు. తర్వాతి కాలంలో ఎమ్మెల్యే అయి ఇటీవల మంత్రి కూడా అయిన రోజా చాలా బిజీగా ఉంటూ వస్తుంది. రోజా ఆ మధ్య మాట్లాడుతూ.. తన కుమార్తెకు చదువుపైనే శ్రద్ద ఎక్కవగా ఉందని.. సైంటిస్ట్ కావాలనే ఆలోచన ఉంది అని చెప్పంది.. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఓ తల్లిగా, నటిగా ఆమెకు అండగా ఉంటానని కూడా పేర్కొంది.