Krishnam Raju : గ్లామర్ ప్రపంచంలో రూమర్స్ అనేవి సర్వసాధారణం, ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని ఎన్నో కథలు పుట్టుకొస్తుంటాయి. అప్పట్లో మీడియా ప్రభావం అంతగా లేదు కాబట్టి రూమర్స్ తక్కువ వచ్చేవి. కాని ఇప్పుడు మాత్రం పుట్టలకొద్ది ప్రచారాలు, రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అప్పట్లో కృష్ణంరాజు – వాణిశ్రీ మధ్య ఎఫైర్ నడిచిందని అనేక వార్తలు వచ్చాయి.. కృష్ణంరాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన కృష్ణవేణి అనే సినిమాలో వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాలో వాణిశ్రీ.. కృష్ణంరాజును డామినేట్ చేసి మరి నటించి మెప్పించింది.
అయితే విక్టరీ మధుసూదన్ రావు ఈ సినిమాకు దర్శకులు కాగా, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే సినిమాలో 70% పాత్ర వాణిశ్రీ కి ఉంటే కృష్ణంరాజుకు కేవలం 30 శాతం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భక్తకన్నప్ప సినిమా కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 8 సినిమాలు దాకా వచ్చాయి.ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది, త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియా తెగ ప్రచారాలు చేసింది. అయితే ఈ విషయం కృష్ణం రాజు ఇంట్లో వాళ్లకి కూడా తెలియడం తో వాళ్ళు కూడా కృష్ణం రాజు ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందట.
అయితే తర్వాత తమ మధ్య ఏమి లేదు, మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడట.ఇలా రూమర్స్ అప్పటి నుండే సెలెబ్రిటీలను చాలా ఇబ్బంది పెట్టేవి. కృష్ణం రాజు అప్పట్లో వాణిశ్రీ మరియు జయ సుధా నటనను బాగా ఇష్టపడేవారు.అందుకే వారితోనే ఎక్కువగా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు. ఇక కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.