Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గలలో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం రోజున ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తమిళ చిత్రం తెరికి ఈ సినిమా రీమేక్ అని అంటున్నారు కానీ.. గ్లింప్స్ చూస్తుంటే అలాంటి సూచనలు ఏమి కనిపించడం లేదు. అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన తీరుకి గ్లింప్స్ ఓ చిన్న టచ్ మాత్రమే అని చెప్పాలి. సినిమా నెక్ట్స్ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను హరీష్ శంకర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడని, ఈ గ్లింప్స్ చూస్తే అర్థమువుతోంది. గ్లింప్స్ ప్రతి యుగంలో అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరిస్తాడని చప్పే భగవద్గీతలోని శ్లోకంతో స్టార్ట్ అయ్యింది. పవన్ తనదైన మాస్ లుక్‌తో కనిపించేశారు.
మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీలోని ఎస్సైగా ఈసారి పవన్ హీరోయిజం చూపించబోతున్నారని క్లియర్‌గా తెలుస్తోంది. ఇక గ్లింప్స్ చివరల్లో ‘ఈసారి పెర్ఫామెన్స్ బద్ధలవుతుంది..సాలే’ అంటూ చెప్పిన డైలాగ్ అయితే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కింది. ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ పక్కా అని క్లియర్ కట్‌గా తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిందని అభిమానులు కామెంట్స్ చేస్తూ ఈ పోస్టర్ ని వైరల్ చేసారు. అంతేకాదు ఈ పోస్టర్ పై నెట్టింట పలు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.