Radhika Apte : హీరోయిన్ రాధికా ఆప్టే గురించి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలయ్య బ్యూటీగా తెలుగులో పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఎలాంటి అడ్డంకులు పెట్టుకోదు. నటిగా రాణిస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. 37 ఏళ్ల ఈ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడిన విధానం వినేవారికి చిరాకు తెప్పించే విధంగా ఉంది.
రాధికా ఆప్టే మనసులో విషయాల్ని ధైర్యంగా చెబుతుంది అని తెలుసు. అయితే తన మనసులో భావాల్ని వ్యక్తపరచడానికి ఇలా తన సూట్ కానీ ఫేక్ ఇంగ్లీష్ యాసలో చిరాకు పుట్టించడం అవసరమా అంటూ ఆమెని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మహిళల త్యాగాలు, బాధ్యతల గురించి రాధికా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో సౌత్ లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి బయట పెట్టింది. సౌత్ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడని చెప్పిన రాధిక .. తన శరీరం గురించి కామెంట్లు చేశాడు అని చెప్పుకొచ్చింది.
తన కెరీర్ మొదట్లో జరిగిన ఆ సంఘటనను గుర్తుతెచ్చుకుంటూ ఇకపై అలాంటి కామెంట్లు విని భరించడానికి తాను సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది. ఇకపై అలాంటి కామెంట్లు ఎదురైనా కూడా తాను కచ్చితంగా అడిగిన వ్యక్తిని నిర్మొహమాటంగా దండిస్తానని పేర్కొంది.. అప్పట్లో తనకి ఒకరు అవకాశాల కోసం ముక్కు సరి చేయించుకోమని బ్రెస్ట్ పెద్దగా ఉండాలని అన్నారని చెప్పుకొచ్చింది రాధిక. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నీ ముక్కు సరి చేయించుకో, బ్రెస్ట్ పెంచుకో అని చాలామంది కామెంట్లు చేశారు కానీ అది కెరీర్ మొదట్లోనే అంటూ రాధికా ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచింది. ఒక మూడు నాలుగు కేజీలు ఎక్కువగా ఉన్నానని నేను ఒక సినిమాలో అవకాశాన్ని కూడా కోల్పోయాను అని రాధిక పేర్కొంది.