Manchu Manoj : ఇటీవల మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తెగ వార్తలలో నిలవడం మనం చూశాం. ముందు తాను ప్రేమించిన భూమా మౌనికని కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని వార్తలలో నిలిచారు. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మనోజ్ – మౌనికా రెడ్డి పెళ్లి తర్వాత తిరుపతిలో కనిపించారు. ఆ సమయంలో తన ప్రేమ, పెళ్లి విషయం గురించి చాలా తక్కువ విషయాలు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’షోలో మెరిశారు. ఇప్పటికే ఈషోకు నిఖిల్ – పల్లవి కలిసి అతిథిగా హాజరై అలరించగా, ఇప్పుడు ఈ జంట కనిపించి ఆశ్చర్యపరచింది.
అయితే షోలో నూతన జంటకి వెన్నెల కిషోర్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పగా, ఆ తర్వాత ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఆ సందర్భంగా మనోజ్.. వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగానే సమాధానం ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలు మేం దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. మౌనికాను వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. ఆమెకు అండగా ఉండకపోతే నేనే బతికే వేస్ట్ అనిపించింది. ఎన్నో డోర్లు మూస్తారో మూయండి అనుకున్నాను అని మనోజ్ అన్నారు.

భూమా మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక.. ఆమె పుట్టినరోజున అలా ఆకాశం వైపు చూస్తూ, ఎక్కడున్నావ్? నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని అనుకున్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి వస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. ఇక మనోజ్… నీకు లవ్ లైఫ్ కావాలా? సినిమా కావాలా సెలెక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది. మనల్ని నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది నాకోసం. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మంచు – మనోజ్ ప్రేమకథ, తర్వాత తాము ఎదుర్కొన్న సమస్యలపై పూర్తి వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.