Ileana : అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నాజూకు నడుముతో కుర్రాళ్ల మతులు పోగొట్టే ఇలియానా ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేసింది లేదు. ‘దేవదాసు’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా .. ‘పోకిరి’ సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పలువురు స్టార్ హీరోలకు జంటగా నటించిన ఈ గోవా అందం బాలీవుడ్ మీద మోజుతో టాలీవుడ్‌కు హ్యాండిచ్చింది.
బాలీవుడ్‌కి వెళ్లాక ఇలియానా పరిస్థితి దారుణంగా మారింది. హిందీలో నాలుగేళ్ల కిందట నటించిన ‘ది బిగ్ బుల్’ చిత్రమే ఆమెకు చివరది. ఈ క్రమంలోనే కొంతకాలం పర్సనల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న అందాల తార.. వాటి నుంచి బయపడి మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. పాపులర్ ర్యాపర్ బాద్‌షా రూపొందించిన మ్యూజిక్ వీడియోలో ఇలియానా తాజాగా దర్శనమిచ్చింది. బాద్‌షా, గోల్డ్‌కార్ట్‌జ్‌తో కలిసి ఈ వీడియోలో కనిపించింది ఇల్లీ బేబీ. ‘సబ్ గజాబ్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో గ్లామర్ అవతార్‌లో కనిపించి తన ట్రేడ్ మార్క్ బెల్లీ డాన్స్‌తో దుమ్మురేపింది. తనలో మునుపటి గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ఈ వీడియోతో చెప్పకనే చెప్పింది.
తాజా వీడియోలో ఇలియానా లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ట్రాన్స ఫరెంట్ డ్రెస్ ధరించి థైస్ అందాలను, నడుము మడతలను, టాప్ అందాలను ఆవిష్కరించిన ఇలియానా పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంత హాట్‌గా, ఇంత బొద్దుగా మారిన ఇలియానాని చూసి ప్రతి ఒక్కరు నోరెళ్లపెడుతున్నారు. వామ్మో ఇదేం లుక్ ఇలియానా అంటున్నారు. నాజూగ్గా ఉండే ఇలియానా ఇలా బొద్దుగా కనిపించడంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా చేతిలో ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. ప్రస్తుతం ఆమె ఖాళీగానే ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.