Indraja : జబర్దస్త్ నుంచి రోజా వెళ్లిపోయిన తర్వాత జడ్డిగా ఆ బాధ్యతను మోస్తున్న సీనియర్ నటి ఇంద్రజ. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా బాగానే మేనేజ్ చేస్తూ వస్తుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొని మహిళల నెలసరి సమస్యలు, వారి భావోద్వేగాలు, బాధ్యతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇంద్రజ. మహిళలు తమను అర్థం చేసుకోలేరా? అని పదే పదే భర్తలను అడగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సైలెంట్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని, మగాళ్లది రివర్స్ సైకాలజీ అంటూ నెక్స్ట్ జనరేషన్‌కు తన అనుభవంతో చెప్పుకొచ్చింది ఇంద్రజ.
మనల్ని ఎవరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పిన ఇంద్రజ.. ముందుగా మనల్ని మనం అర్థం చేసుకుంటే చాలని పేర్కొంది. ఇక మూడ్ స్వింగ్స్ గురించి చెప్తూ.. మహిళలు తమ హార్మోన్స్ ఎంత ఇంబ్యాలన్స్ అవుతున్నాయో అస్సలు ఆలోచించట్లేదని అన్నారు ఇంద్రజ. కుటుంబ భారమంతా మన నెత్తిన వేసుకుని, ప్రపంచమంతా మన భుజాల మీద మోస్తున్న ఫీలింగ్‌తో పనిచేస్తున్నప్పటికీ ఎవరు కూడా గుర్తించరు. పర్సనల్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్‌ను ఎవరికి వారు హ్యాండిల్ చేయలేకపోతే అపోజిట్ పర్సన్ ఎలా సాల్వ్ చేస్తారంటూ ప్రశ్నించారు.
మహిళలు ‘ఎస్’ చెప్పాల్సిన చోట్ ఎస్ చెప్పాలని, ‘నో’ చెప్పాల్సిన చోట అది ఎవ్వరైనా సరే ‘నో’ అని మాత్రమే చెప్పాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. అంతేకాదు తల్లి, కొడుకు, భర్త.. ఇలా ఎవ్వరి కోసమో నిర్ణయాన్ని మార్చుకోవద్దని, మీరు ఇండివిడ్యువల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇంద్రజ కొంత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు షోలకు ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు అప్పుడప్పుడూ జరిగే ఫెస్టివల్ షోలలో కూడా తెగ సందడి చేస్తుంది. డ్యాన్స్ కూడా బాగానే చేయడంతో ఫ్యాన్స్ కూడా ఈ సీనియర్ బ్యూటీని బాగానే స్వాగతిస్తున్నారు.