Aditi Rao Hydari : హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇతను కొంత కాలంగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నాడు. మహాసముద్రం సినిమాతో ఇటీవల పలకరించాడు. అయితే కొంత కాలంగా అతను హైదరబాదీ బ్యూటీ అదితి రావు హైదరి తో డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి మహా సముద్రం లో నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఇద్దరు కలిసి పాల్గొన్నారు.
తాజాగా ఇద్దరు కలిసి ఓ తమిళ పాటకి రీల్ చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది అదితి రావు హైదరీ. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్, అదితి బహిరంగంగానే ప్రేమించుకుంటున్నారని, ఇదే సాక్ష్యం అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అదితి రావు హైదరీ స్పందించింది. ఓ మీడియాతో ఆమె ముచ్చటిస్తున్న క్రమంలో సిద్ధార్థ్‌తో లవ్ ఎఫైర్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అదితి. ఇందులో ఆమె పేర్కొంటూ తన వ్యక్తిగత విషయాలపై ఎందుకంత ఆసక్తి అంటూ ప్రశ్నించింది. పర్సనల్ విషయాలు కాదు, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టండి అని తెలిపింది.
తాను ఎవరితో రిలేషన్‌లో ఉన్నాననే దానిపై కాకుండా తన సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని పేర్కొంది.మంచి దర్శకులతో పనిచేయడం ఇష్టమని, కెరీర్ పై దృష్టి పెడుతున్నానని చెప్పింది. ఆడియెన్స్ తనని ఆదరించి తన సినిమాలు చూసేంత వరకు తాను సినిమాలు చేస్తానని వెల్లడించింది. కానీ సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నారా? లేరా అనేది మాత్రం ఆమె చెప్పలేదు. ఇద్దరు తమ ప్రేమ గురించి హింట్ ఇస్తున్నా కూడా ఎందుకో అఫీషియల్‌గా చెప్పడం లేదు.