కరోనా పాండమిక్, లాక్ డౌన్ వల్ల థియేటర్లు కొన్నిరోజులు మూతపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఓటీటీల హవా పెరిగిపోయింది. విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి టైమ్ పాస్ దొరికింది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది. ఇక వాళ్ల అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మించడం మొదలు పెట్టాయి ఓటీటీ సంస్థలు. కరోనా తగ్గిన తర్వాత, థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి వీకెండ్ కు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
ఫిబ్రవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో ద స్ట్రేస్, ఫిబ్రవరి 23న నన్‌వేకల్ నేరట్టు మయక్కం,అవుటర్ బ్యాంక్, ఫిబ్రవరి 24న వియ్ హావ్ ఎ ఘోస్ట్,ఎక్వైట్ ప్లేస్ 2 నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 20న థంకమ్, ఫిబ్రవరి 22న వారసుడు స్ట్రీమింగ్ జరగనుంది. పిబ్రవరి 24న జీ5లో పులి మేక, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 23న వీరసింహారెడ్డి, ఫిబ్రవరి 24న రబియా అండ్ ఒలీవియా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో ఫిబ్రవరి 24న మైఖెల్, సోనీ లైవ్‌లో పొట్లక్ సిరీస్ ఫిబ్రవరి 24న స్టీమింగ్ కానుంది.
వారిసు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈ మూడు చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కాగా, ఇప్పుడు ఇవి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈ మూడు సినిమాలు ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతాయా అని అందరు ఆశగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకి ఇవి ఫిబ్రవరి నెలాఖరులో విడుదల కానుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దమవుతున్నాయి.