Itlu Maredumilli Prajaneekam : టాలీవుడ్‌లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయి హస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఆయనకి ఇటీవలి కాలంలో పెద్దగా విజయాలు పలకరించడం లేదు. ఈ క్రమంలో నాంది వంటి సీరియస్ సబ్జెక్ట్‌తో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అదే జోష్‌లో ఇటీవలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి మరో సీరియస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రాన్ని ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా, డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ-5 సంస్థ దక్కించుకుంది. ఇక డిసెంబర్ 23నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలను పక్కనపెట్టి కాన్సెస్ట్ ఓరియంటెడ్ మూవీస్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిససిందే. గతేడాది ‘నాంది’ అంటూ డిఫరెంట్ అటెంప్ట్ చేసిన అల్లరోడు.. ఇటీవలే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేశాడు. ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల కాగా, ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది.దీంతో కలెక్షన్లు కూడా పర్వాలేదనిపించాయి, కాని రాను కలెక్షన్స్ తగ్గాయి. దీంతో చేసేదేం లేక డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.