Mahesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ నవంబర్ 15న కన్నుమూసారు. కొద్ది సేపటి క్రితం ఆయన అంత్యక్రియలు ముగిసాయి. కృష్ణని కడసారి చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. కృష్ణ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఘట్టమనేని ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం మహేష్ బాబుకు తీరని బాధను కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో మహేష్ ఎక్కువ స్థాయిలో ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. ఎంతో సున్నితంగా ఉండే మహేష్ ఇలాంటి కఠినమైన సమయాలను ఎదుర్కోవడం అభిమానులను కూడా కలవరపెడుతోంది.
మహేష్ బాబు ఇదే ఏడాది తన సోదరుడు రమేష్ బాబు ని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన హాస్పిటల్ లో మృతి చెందారు. అన్నయ్యతో కూడా మహేష్ బాబుకు ఎంతో అనుబంధం ఉంది. అతను మృతి చెందడం కూడా మహేష్ బాబుకు తీరని లోటు అని చెప్పాలి. సెప్టెంబర్ 28వ తేదీన ఆయన తల్లి మరణించిన విషయం తెలిసిందే. తల్లి మరణం కూడా మహేష్ బాబుకు తీరని లోటును కలిగించింది. మహేష్ బాబు తల్లి మాటకు ఎంతో కట్టుబడి ఉండేవాడు. తల్లితో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్న మహేష్ బాబు ఆమెను కోల్పోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు.
తల్లి మరణించిన కొద్ది రోజులకే తండ్రి కూడా కోల్పోవడంతో మహేష్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనకు ఈ స్థానం వచ్చింది అంటే కేవలం తండ్రి వల్లే అంటూ తరచుగా మహేష్ చెప్పుకుంటూ ఉంటారు. వరుస మరణాలతో మహేష్ బాబు చాలా ఆందోళనలో ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ఓ టీవీ ఛానెల్ విలువలు కోల్పోయి మహేష్ సందడి చేస్తున్న ఎపిసోడ్ ప్రసారం చేశారు. ఇందులో మహేష్ చాలా సంతోషంగా ఉండడంతో పాటు కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడుతున్నారు. కృష్ణ మరణించి మహేష్ చాలా విషాదంలో ఉండగా, ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తారా అంటూ కొందరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎప్పుడు ఏది టెలికాస్ట్ చేయోలో కూడా మీకు తెలియదా అంటూ కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.