Naresh : ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా ట్రోల్స్‌కు గురైన వారు ఎవరు.. అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మంచు విష్ణు. ఆ తరువాత స్థానంలో నటుడు నరేష్ ఉంటారని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఆయన ఈమధ్య చేసిన పనులు.. బయట పడిన ఆయన బండారం అనే చెప్పవచ్చు. గతంలో ఆయనకు చాలా గౌరవం ఉండేది. విజయనిర్మల కొడుకుగా ఆయనకు మర్యాద ఇచ్చేవారు. కానీ మా ఎన్నికల్లో ఆయన మంచు విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆయనపై నెగెటివిటీ ఎక్కువై పోయింది. మరోవైపు ఈ మధ్య పవిత్ర లోకేష్‌తో కలిసి సహజీవనం చేస్తుండడం ఆయన ప్రతిష్టను మరింత దిగజార్చాయి. దీంతో నరేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు.
తాజాగా నరేష్ మరోమారు ట్రోలింగ్‌కు గురయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ గుండె పోటుతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించారు. అయితే విజయనిర్మల మరణం అనంతరం నుంచి నరేష్ కృష్ణ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయనను నరేష్ చూసుకుంటున్నారు. ఇక తాజాగా హాస్పిటల్‌లో చేర్పించిన దగ్గర నుంచి ఆయన అంత్యక్రియల వరకు నరేష్ దగ్గరుండి చూసుకున్నాడు. అయితే కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చారు.
![Naresh : ఆ.. సాలు తియ్య ఇగ.. ఊకో.. నరేష్ వీడియో వైరల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. Naresh getting trolled after krishna final rituals place](http://3.0.182.119/wp-content/uploads/2022/11/naresh-video-viral.jpg)
కృష్ణ భౌతిక దేహానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ మహేష్ బాబు, నమ్రత దంపతులతో మాట్లాడారు. మహేష్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అనంతరం మహేష్‌తో కేసీఆర్ కాసేపు మాట్లాడారు. అయితే అదే సమయంలో నరేష్ కలగజేసుకుని ఏదో చెప్పబోగా వద్దన్నట్లు సీఎం కేసీఆర్ ఓదార్చారు. దీంతో ఆ వీడియోను ఆసరగా చేసుకుని నరేష్ ను నెటిజన్లు మరోమారు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ.. సాలు తియ్యి ఇగ.. ఊకో.. అంటూ ఆ వీడియోకు కాప్షన్లు పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో నరేష్‌ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
Naresh Bhajana gadu ani KCR ki telusu…. tappu ledu 👍 https://t.co/gsTGeA43rA
— T N R (@SenseMakinghere) November 15, 2022