Honey And Dates : ఖర్జూరాలు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిని చాలా మంది తీపి వంటకాల్లో వేస్తుంటారు. చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. ఇక తేనె కూడా ఎంతో తియ్యగా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే మీకు తెలుసా.. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సీసాలో సగం వరకు ఖర్జూరాలను తీసుకోవాలి. వాటిల్లోని విత్తనాలను తీసేసి సీసాలో వేయాలి. అనంతరం ఖర్జూరాలు పూర్తిగా మునిగే వరకు వాటిపై తేనె పోయాలి. తరువాత వాటిని బాగా కలపాలి. అనంతరం ఆ సీసాకు మూత పెట్టేయాలి. ఇలా వారం రోజుల పాటు ఉంచాలి. దీంతో తేనెలో ఖర్జూరాలు బాగా నానుతాయి. ఇలా అయ్యాక ఖర్జూరాలను బయటకు తీసి రోజుకు 3 లేదా 4 చొప్పున తింటుండాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ఖర్జూరాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల రక్తం అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
కొందరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే నీరసంగా ఉందని.. ఏ పని చేయలేమని.. అలసిపోయామని చెబుతుంటారు. అలాంటి వారు ఉదయాన్నే తేనె, ఖర్జూరాల మిశ్రమం తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎలాంటి అలసట ఉండదు. నీరసం రాదు. అలాగే ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. అలాగే హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు.
ఇలా తేనె, ఖర్జూరాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. రోజంతా బద్దకంగా ఉండేవారు ఈ మిశ్రమాన్ని తింటే వెంటనే లేచి పరుగెడతారు. యాక్టివ్‌గా ఉంటారు. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు. వారిలో ఎదుగుదల లోపాలు రావు. కనుక ఈ మిశ్రమాన్ని ప్రతి ఒక్కరూ రోజూ తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.