Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi : సూపర్ స్టార్ కృష్ణకి స్థలం అమ్మి.. చిరంజీవి అప్పులు తీర్చారా.. అస‌లు ఏం జ‌రిగింది..?

editor by editor
February 13, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు సర్వసాధారణమే. కేవలం సినీ రంగం మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కొంత మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులను పోగేసి.. ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. చాలా వరకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు. అయితే హీరోలలో అలాంటివి చాలా తక్కువ. అయితే కొన్ని అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తులను అమ్మి అప్పులను తీర్చిన సందర్భాలు దాదాపు అందరు హీరోల జీవితాల్లోనూ చూశాం. అలాంటి ఘటన మెగాస్టార్ చిరంజీవి జీవితంలోనూ ఉంది. ఏదో తొలినాళ్ళలో అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. అది కూడా ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న తరువాతనే అది జరిగింది.

చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండటం వల్ల తొలుత స్టూడియోలు అన్నీ అక్కడే ఉండేవి. అలా చాలామంది తెలుగు నటులు కూడా అక్కడే ఆస్తులను చేసుకుని కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉండిపోగా మరి కొంత మంది హైదరాబాద్ వచ్చేశారు. అలా సూపర్ స్టార్ కృష్ణ అరుణాచలం గార్డెన్స్ పక్కన చెన్నైలో ఐదు ఎకరాల స్థలం తీసుకుని కృష్ణ గార్డెన్స్ గా నామకరణం చేసి షూటింగ్ లకు పనికి వచ్చేలా డెవలప్ చేశారు. ఆ గార్డెన్స్ లో వచ్చిన మొదటి సినిమా ఈనాడు. ఈ సినిమా కోసం మురికివాడకు సంబంధించిన సెట్స్ వేశారు. ఇక ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల షూటింగ్స్ కూడా కృష్ణ గార్డెన్స్ లో జరిగేవి. ఇక అందులో ఒక ఎకరా చిరంజీవి ఎప్పుడో కొనుగోలు చేశారు.

Chiranjeevi paid his debts by selling his land to Krishna
Chiranjeevi

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. ఇదంతా తెలిసిన కథ అయితే ఆ సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారట. చిరు అందుకోసం అప్పు చేశారట. అప్పు తీర్చడానికి చెన్నై కృష్ణ గార్డెన్స్ లోని ఎకరా స్థలం అమ్మేశారట. దాంతో వచ్చిన రూ.25 కోట్ల డబ్బులతో అప్పులు తీర్చారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవికి అతి సన్నిహితుడైన ఎన్ వీ ప్రసాద్ గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారంటూ చెప్పారు. ఇక కృష్ణ గార్డెన్స్ లోని 4 ఎకరాల్లో పద్మాలయ వారు డెవలప్‌మెంట్ కు ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ అరుణాచలం స్టూడియో కూడా లేదు. ఇక కృష్ణ గార్డెన్స్ కూడా అపార్ట్‌మెంట్‌ తో ఉంది.

Tags: chiranjeeviKrishna
Previous Post

Tomato Juice : రోజూ ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్‌.. అంతే.. దెబ్బ‌కు రోగాలు ప‌రార్‌..!

Next Post

Honey And Dates : తేనె, ఖ‌ర్జూరాల‌ను ఇలా తింటే.. ఎంత మేలు జ‌రుగుతుందో తెలుసా..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.