Senior Actress Poojitha : తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 138 చిత్రాల్లో నటించి.. తెలుగులో 70 సినిమాలకు పైగా నటించిన మెప్పించిన అలనాటి నటి పూజిత ఇటీవల మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ చిత్రంతో పాపులర్ అయిన పూజిత.. ఆ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి రెండో భార్యగా నటించారు. అంతేకాదు ఆయతో ఎన్నో సినిమాలలో నటించింది. అయితే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లెటర్ కోసం వెళ్లాను. అప్పుడు లెటర్ కోసం ‘మా’కి వెళ్లినప్పుడు రాజేంద్రప్రసాద్ గారు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించారు. నాతో మాట్లాడితే తప్పు అన్నట్టుగా చూశారు.
ఇద్దరం ఈసీ మెంబర్స్‌గా చేసిన వాళ్లమే కానీ ఆయన ప్రెసిడెంట్ అయ్యేసరికి ఈసీ మెంబర్‌ని అని చిన్న చూపు చూశారు. ప్రెసిడెంట్ అయిన తరువాత మేం ఎవరూ గుర్తులేమంటే ఆయనకి పోయే కాలం వచ్చినట్టు. ప్రెసిడెంట్ కానీ.. జనరల్ సెక్రటరీ కానీ.. అసలు నేను ఏం చెప్తున్నానో కూడా వినడానికి ఇష్టపడటం లేదు. నాకు అడుక్కోవడం ఇష్టం లేక వచ్చేసారు. వాళ్లు నేను ఇచ్చిన పేపర్‌ని కూడా చదవలేదు. అప్పుడు నేను ఒక నవ్వు నవ్వుకుని నేను ఓట్లు వేస్తే గెలిచిన వాడు.. నన్ను హేళన చేస్తున్నాడు అని అనుకున్నాను అని పూజిత చెప్పుకొచ్చింది. రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా వీళ్లిద్దరూ హెల్ప్ చేయలేదు.
![Senior Actress Poojitha : రాజేంద్రప్రసాద్, నరేష్ జాతకాలు బయటపెట్టిన పూజిత Senior Actress Poojitha comments on naresh and rajendra prasad](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2023/01/senior-actress-poojitha.jpg?resize=1200%2C675&ssl=1)
నరేష్‌తో నేను హీరోయిన్‌గా మూడు సినిమాలు చేయాలి కాని బిజీగా ఉండడం వలన మిస్ అయ్యాయి. అయితే ఆయనను చాలామంది వియర్శిస్తుంటారు కానీ.. చాలామంది వ్యక్తి. మాకి ఆయన చాలా చేశారు. మా మెంబర్స్‌కి పెన్షన్ కానీ.. కళ్యాణ లక్ష్మి కానీ.. ఇతర పథకాలు కానీ ఆయన తెచ్చినవే. ఇన్ని మంచి పనులు చేసి.. చివరికి కోరి.. కోరి.. శనిని నెత్తిపైకి తెచ్చుకున్నారు. నా జన్మ ఉన్నంత వరకూ నాకు ఉన్న మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది నరేష్ మాత్రమే అంటూ నటి పూజిత చెప్పుకొచ్చింది.