Viral Pic : ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో మనం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో పొందుపరిచి పెద్దయ్యాక చూసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇక సెలబ్రిటీలకు సంబంధించినవి బయటికి వస్తే అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా చెన్నై చంద్రం త్రిష క్యూట్ పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. స్కూల్ డ్రెస్‌లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎంత ముద్దొస్తుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నీ మనసు నాకు తెలుసు ” అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష.. ఫస్ట్ సినిమాతో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ ట్రోల్స్ తో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో మైమరిపించేసింది . అంతేకాదు కంటెంట్ ఉన్న పాత్రలో నటిస్తూ త్రిష కోట్లాదిమంది జనాలను తన అభిమానులుగా మార్చుకుంది. రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్లలో త్రిషను చూసిన వారు, వారెవ్వా.. త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి? అందరికీ వయసు పెరుగుతుంటే, ఈమెకు మాత్రం ఏజ్ తగ్గుతుందా? అని ముచ్చటించుకున్నారు.
ఇదే మాటను ఆమెతోనే అంటే, సరదాగా నవ్వేసి ఊరుకున్నారు బ్యూటీ. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తుంది త్రిష. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో రాంగీ ఒకటి. ‘జర్నీ’ ఫేం శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ రాంగీ సినిమాను డిసెంబర్ 30న థియేటర్‌లలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ్ , తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న త్రిష .. వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా.. మధ్యలో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మాత్రం దూసుకుపోతున్నట్టుగానే ఉంది.