Balakrishna : నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు. ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో విశేష ప్రజాదరణ పొందగా. ప్రముఖులతో బాలకృష్ణ ముచ్చట్లు, సరదా సంగతులు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్ స్టాపబుల్ -2 లేటెస్ట్ ఎపిసోడ్ భారీస్థాయిలో అంచనాలను పెంచుతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ ను ఆహా ఓటీటీ యూట్యూబ్ లో పంచుకోగా, ఇందులో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ లో అలరించేందుకు వస్తున్నాడంటూ నిర్వహకులు పేర్కొన్నారు.
బాలయ్య, ప్రభాస్ మధ్య ఎలాంటి డిస్కషన్ నడుస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా ఈ షోకి సంబంధించిన వీడియో ఒకటి లీకైంది.ఈ వీడియో చూస్తుంటే… బాలయ్య.. ప్రభాస్‌ను ఏవో చిలిపి ప్రశ్నలు బాలయ్య అడిగినట్లు అర్థం అవుతోంది. ప్రభాస్ డ్రెస్సింగ్‌ని ఉద్దేశించి.. బాలయ్య.. నీ షర్ట్ సైజ్ ట్రిపుల్ ఎక్స్ఎలా, ఫోర్ ఎక్స్‌ఎలా అంటూ బాలయ్య ప్రశ్నించినట్లు వీడియో బట్టి తెలుస్తుంది. బాలయ్య ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘కేవలం షర్ట్ సైజ్ మాత్రమే కాదు.. నాకు షూ దొరకడం కూడా కష్టమే. షూ సైజ్ 13’’ అని ప్రభాస్ సమాధానం ఇచ్చారు. దానికి బాలయ్య.. ఫన్నీగా ‘వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని’ అని కామెంట్ చేశాడు. ఆ మాటలకు ప్రభాస్ తెగ నవ్వేశాడు.
ప్రస్తుతం లీకైన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇద్దరు టాప్ హీరోల మధ్య షో అంటే ఎంత ఎగ్జైటింగ్ అభిమానులలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ఇక బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో సంక్రాంతికి పలకరించబోతున్నాడు.
Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO
— Prabhas World (@Prabhas_Team) December 11, 2022