Satyadev : టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో సత్యదేవ్ తప్పక ఉంటారు. ఆయన ఏ పాత్ర చేసిన కూడా నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. ఆయన నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడవి శేష్ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈవెంట్‌లో స్టేజిపై సత్యదేవ్, తమన్నా..తమ మాటలతో నవ్వులు పూయించారు. “మీ భార్యను మాకు చూపించవా?” అంటూ ఈ సందర్బంగా సత్యదేవ్ ను తమన్నా ప్రశ్నించడంతో , సత్యదేవ్ తన భార్య దీపికను పరిచయం చేస్తాడు. ఈమే నా భార్య… నా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. నాకు, నా సినిమాలకి ఆమె ఎల్లప్పుడూ అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తుంటుంది,” అని భార్యని ప్రశంసించాడు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకోగా, పెళ్లి చేసుకున్నప్పటి నుండి దీపిక తన భర్త సత్యదేవ్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వంయవహరిస్తూ ఉంది.
ఇక సత్యదేవ్ విషయానికి వస్తే ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం మొదలుపెట్టాడు. తన నటనతో మెప్పించి సినిమా అవకాశాలను అందుకున్నాడు. అయితే గుర్తుందా శీతాకాలం సినిమా గురించి సత్యదేవ్, తమన్నాలు అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భాగా సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో తమన్న ధరించిన బిని అనే కాస్య్టూమ్ డిజైన్ అందరిని ఆకట్టుకుంటుంది. దానికి ఈ సినిమాలో ఓ ప్రత్యేక స్టోరీ ఉంటుంది. దానిని అంతే ప్రత్యేకంగా డిజైన్ చేయడం వెనుకాల దీపిక ఉంది. నా స్టైలింగ్ అంతా ఆమె చేసింది. ఈ సినిమా కోసం ప్రత్యేక కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు దీపికకు కృతజ్ఞతలు” అని సత్యదేవ్ అన్నారు.