Hit 2 Movie Review : యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకోగా, తాజాగా హిట్ 2 చిత్రంతో పలకరించాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించారు. అడివి శేష్ హీరో కావడంతో సినిమాకి అనుకూలతలు ఏర్పడ్డాయి. హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేయగా.. ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో చూద్దాం.
కథ..
వైజాగ్ లో సంజన అనే అమ్మాయి హత్యకు గురవుతుంది.. ఆమెను ఎవరో దారుణంగా హింసించి చంపేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కృష్ణదేవ్(అడివి శేష్) అలియాస్ కేడి రంగంలోకి దిగుతాడు. ఇలాంటి కేసులు చాలా చూసాను చెప్పుకొచ్చిన ఆయనకి ఈ కేసు సవాల్‌గా మారుతుంది. మర్డర్ కి గురైంది సంజన మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కూడి ఉందని తెలిసి కేడీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఈ సైకో సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ? కేసుని కేడీ ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఇంతకు ముందు తన పర్‌ఫార్మెన్స్ తో అదరగొట్టిన అడివి శేష్ కేడి రోల్ లో అదరగొట్టారు. ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. హీరోయిన్ పాత్రకు కథ రీత్యా పెద్దగా పరిధి లేదు. మీనాక్షి చౌదరి పర్లేదు అనిపించారు. సాంకేతికంగా చూస్తే బీజీఎం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కి పాస్ మార్క్స్ వేయవచ్చు. హిట్ 2 చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్..
- అడివి శేష్ యాక్టింగ్
- డైరెక్షన్
- స్క్రీన్ ప్లే
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్..
- ఫస్ట్ హాఫ్
- బీజీఎం
సినిమా థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారికి ఎంతగానో నచ్చుతుంది రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చూసేవారికి అంతగా నచ్చకపోవచ్చు. స్లోగా మొదలయ్యే హిట్ సెకండ్ హాఫ్ లో పుంజుకొని క్లైమాక్స్ లో మాత్రం అదరగొట్టేస్తుంది. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తాయి. సమయానుసారంగా వచ్చే ట్విస్ట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి. హిట్ 3 హీరో ఎవరో పరిచయం చేయడం బాగుంది.