Sr NTR Grand Daughters : తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఏర్పరచుకున్న నటుడు నందమూరి తారకరామారావు. ఆయనకు మొత్తం పంన్నెండుమంది సంతానం ఉన్నారు. పన్నెండు మందిలో 8 మంది కొడుకులు కాగా 4 గురు కూతుళ్లు ఉన్నారు. అయితే వారిలో బాలకృష్ణ, హరికృష్ణ తప్ప మిగతావారు ఎవరూ పెద్దగా పరిచయం లేదు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ. ఈయన చిన్నప్పుడే చనిపోయారు. ఇక రెండవ కుమారుడిపేరు జయకృష్ణ. ఈయన బిజినెస్ చేస్తున్నారు. మూడవ సంతానం దగ్గుబాటి పునందేశ్వరి. ఈమె ఏపీ రాజాకీయాల్లో చురుకుగా ఉంటారు. నాలుగవ సంతానం నందమూరి సాయి కృష్ణ. ఈయన కూడా చనిపోయారు.
ఇక అన్నగారి ఐదవ సంతానం నందమూరి హరికృష్ణ. ఈయన 2018లో కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆరవ సంతానం నందమూరి మోహన కృష్ణ. టాలీవుడ్ హీరో తారకరత్నమోహన కృష్ణ కుమారుడే. అయితే తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తారకరత్నతో మోహన కృష్ణ కు మాటలు లేవు. అయితే ఎన్టీఆర్ కి భక్తి భావం ఎక్కువగా ఉంటుంది తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది అందుకే వాళ్ల కొడుకులకి కానీ,కూతుళ్ళకి కానీ మనవాళ్లకు గాని, మనవరాళ్ల గాని మంచి మంచి పేర్లని సెలెక్ట్ చేసి పెట్టాడు.
మనవరాళ్ల విషయానికి వస్తే జయకృష్ణ కి ఒక కూతురు ఉంది ఆమె పేరు కుముదిని అలాగే హరికృష్ణకు ఒక కూతురు ఉంది ఆమె పేరు మొదట్లో వెంకట రామమ్మ అని పెట్టినప్పటికీతర్వాత ఆమె పేరు సుహాసిని అని పెట్టారు, బాలకృష్ణ కి ఇద్దరు కుమార్తెలు పెద్ద అమ్మాయి పేరు బ్రాహ్మణి, చిన్న అమ్మాయి పేరు తేజస్విని , అలాగే సాయి కృష్ణ కూతురు పేరు ఈషాని ఇలాంటి పేర్లను పెట్టి తెలుగు పైన తనకు ఎంత మమకారం ఉందో రుజువు చేశారు ఎన్టీఆర్. కాగా, ఎన్టీఆర్ తన నలుగురు కూతుళ్ల పేర్ల చివరన కూడా ఈశ్వరి అనే పేరు వచ్చేలా నామకరణం చేసిన విషయం తెలిసిందే.