Sr NTR : తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ఇక అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలానే సూపర్ హిట్ అయ్యాయి.
కానీ ఎన్టీఆర్ తన ఒక్క సూపర్ హిట్ సినిమాలో మాత్రం శ్రీదేవిని వద్దు అని చెప్పారట. ఎన్టీఆర్ హిట్ సినిమాల లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది ఆరాధన సినిమా. ఈ సినిమా కథ పరంగాను.. పాటల పరంగాను… ఎమోషన్ పరంగాను అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో అన్ని పాటలు అప్పటి స్టార్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు పడాల్సింది. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ కు బాలుగారికి చిన్న విబేధాలు రావడంతో హిందీ సింగర్ మహమ్మద్ రఫీతో పాటలు పాడించారు. అయితే హీరోయిన్స్ విషయంలో కూడా ఇలానే జరిగింది.
మొదట ఈ సినిమాలో జయప్రదను హీరోయిన్ గా అనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత శ్రీదేవికి ఎన్టీఆర్ గా జంటగా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇందులో శ్రీదేవిని వద్దని.. వాణిశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గత సినిమాలో వాణిశ్రీ నటనను చూసిన ఎన్టీఆర్.. ఈ సినిమాలో ఆమె అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది అని అనుకున్నారట. దీంతో ఇందులో ఎన్టీఆర్ కు వాణిశ్రీ జత కట్టింది. ఇక సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఎన్టీఆర్ – వాణిశ్రీ జంట కూడా అభిమానులకు బాగా నచ్చేసింది.