Kantara : కన్నడ చిత్రం కాంతార ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కన్నడలోనే ఓ మోస్తారుగా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహలకందని రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాల్లో కాంతార టాప్ లిస్టులో చేరిపోయింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం మనందరికి తెలిసిందే. 16 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 350 కోట్ల వసూళ్లు అందుకుంది.
తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.350కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది. కేవలం ఓ భాషలో ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ రేంజ్‌లో కలెక్షన్లని సాధించడం ట్రేడ్ వర్గాలను, సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. `కాంతార` చిత్రం గత నెలలో విడుదలైంది. మొదట కన్నడనాటే విడుదలైన ఈ సినిమా వారం పది రోజుల గ్యాప్‌తో తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనూ విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది.
తెలుగులో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ చానల్స్ గట్టిగా పోటీపడ్డాయి. ఇక ఫైనల్ గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా శాటిలైట్ డీల్ 4.5 కోట్ల రేంజ్ లో క్లోజ్ అయినట్లు తెలుస్తుంది.. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి డీల్స్ అయితే లభిస్తున్నాయి. ప్రస్తుతం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఓటీటీ డీల్ ప్రకారం అయితే ఇప్పటికే ఓటీటీలో సినిమా ప్రసారం కావాలి. కానీ నిర్మాతలు మరికొంత సమయం తీసుకొని ఓటీటీ లో విడుదల చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా, ప్రైమ్ పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.