ఎప్పుడు చలాకీగా ఉండే సమంత ఇటీవల తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజమే అని తెలుసుకొని నిరాశ చెందారు. ఇక సమంతకు ఇలాంటి వ్యాధి సోకిందని తెలియగానే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందించారు. చిరంజీవి, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులతో పాటు అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్, సుశాంత్ కూడా స్పందించారు. అయితే నాగ చైతన్య, నాగార్జున తమ సోషల్ మీడియా వేదికగా సమంత ఆరోగ్యం గురించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఆసుపత్రికి వెళ్లి ఆమెను కలిశారని, బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పారని నెట్టింట వార్తలు పుట్టుకొచ్చాయి. ఆసుపత్రిలో చైతూకి సమంత స్వీట్ హగ్ ఇచ్చిందని కూడా కొందరు రాసుకొచ్చారు. మరి కొందరు అదంతా ఉట్టి పుకార్లేనని కొట్టి పారేస్తున్నారు. అయితే నాగార్జున.. సమంతని కలవమని నాగ చైతన్యకు సూచించాడని, బిజీ షెడ్యూల్ వలన అది కురలేదని అంటున్నారు. అయితే సమంతకు కాల్ చేసిన నాగ చైతన్య ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారట.
ఏదైన సాయం కావాలంటే అడగమని కూడా చెప్పాడట. మరి ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య గురించి మరిన్ని ఎక్కువ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా ఒకరి దగ్గర ఒకరి జ్ఞాపకాలు పదిలంగానే ఉంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలు కంప్లీట్ చేసిన సామ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తన అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనుందని తెలిసింది.